ఓ నేనే ఓ నువ్వని

ఓ నేనే ఓ నువ్వని ఒక తీరే మన ప్రేమని
నీ గూటికే రాని
నేనంటు ఇక లేనని నీ వెంటే ఉన్నానని చాటనీ
చేసానే నీ స్నేహాన్ని...పోల్చానే నాదో కానీ
నీ వాణ్ణి

ఓ నేనే ఓ నువ్వని ఒక తీరే మన ప్రేమని
నీ గూటికే రాని

మారాము చేసే మారాణి ఊసే నాలోన దాచానులే
గారాలు పోయే రాగాల హాయే నా గుండెనే తాకెలే
నీ కొంటె కోపాలు చూడాలనే ......దొబూచులాడేను ఇన్నాళ్ళుగా
సరదా సరాగాలు ప్రేమేగా

ఓ నేనే ఓ నువ్వని ఒక తీరే మన ప్రేమని
నీ గూటికే రాని
నీ నీడలాగ నీతోనే ఉన్నా నీ జంట నేనవ్వనా
వేరెవ్వరు నా నీ గుండెలోన నా కంట నీరాగునా
ఆ తలపు నా ఊహకే తోచునా..... నా శ్వాస నిను వీడి జీవించునా
నీ కంటి పాపల్లే నేలేనా

ఓ నేనే ఓ నువ్వని ఒక తీరే మన ప్రేమని
నీ గూటికే రాని
నేనంటు ఇక లేనని నీ వెంటే ఉన్నానని చాటనీ
చేసానే నీ స్నేహాన్ని...పోల్చానే నాదో కానీ
నీ వాణ్ణి

0 comments:

Post a Comment